* కాంగ్రెస్ కు భవిష్యత్ లేదు
* ఆరు గ్యారెంటీలను తుంగలో తొక్కారు
* రైతులకు అండగా ఉంటాం
* ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తాం
అగ్నిప్రమాదం బాధితులను పరామర్శించిన బండి సంజయ్ఆకేరున్యూస్, కరీంనగర్ మే 31: బీ ఆర్ ఎస్ ఫాం హౌస్ పార్టీ అని.. కాంగ్రెస్ కు కాలం చెల్లిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లోని ప్రశాంత్ నగర్ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో బాధితులను బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో గుడిసెలను కోల్పోయి నీడ లేకుండా మారడం విచారకరమన్నారు. అగ్ని ప్రమాద బాధితులకు తాత్కాలింకంగా పునరావాసం కల్పించడమే కాకుండా బియ్యం తదితర ఆహార పరార్థాలను పంపిణీ చేశామని తెలిపారు..అదే విధంగా గంగాధరలో 2 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 2014లో ఇచ్చిన హామీ మేరకు దేశంలో రైతుల ఆదాయాన్ని పెంచామని గుర్తు చేశారు.రైతుల కనీస మద్దతు ధరను పెంచి వారిని అన్ని విధాలా ఆదుకుంటున్నామని బండి సంజయ్ అన్నారు.రైతుల కనీస మద్దతు ధనరు 80 శాతానికి పెంచి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామన్నారు. గత పది సంవత్సరాల కాలంలో తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లను 2 లక్షల 30 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తోందని బండి సంజయ్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ ఎస్ బీజేపీలో విలీనం అనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇదంతా కావాలని కాంగ్రెప్ పార్టీ చేస్తోన్న ప్రచారం అని ఆయన అన్నారుజ రానున్న రోజుల్లో తెలంగాణలో బీ ఆర్ ఎస్ .. కాంగ్రెస్ లు ఉండవని ఆయన జోస్యం చెప్పారు.
………………………………………………..
