ఆకేరున్యూస్, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ ముగిసింది. ఏడు గంటలకు పైగా సిట్ అధికారులు హరీష్ రావును ప్రశ్నించారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ మీద తనకు నమ్మకం ఉందని తెలిపారు. నేను తప్పు చేయలేదు.. కేవలం బురదజల్లే ప్రయత్నంలో భాగంగానే ఈ కేసు పెట్టారని పేర్కొన్నారు. ఇది రాజకీయ డ్రామా అని అన్నారు. మేం భయపడం.. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి నన్ను ఎంత ఇన్వాల్వ్ చేసినా సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు.
…………………………………..
