* జూబ్లీహిల్స్లో గట్టి పోటీ ఇచ్చాం
* మాగంటి సునీత చాలా కష్టపడ్డారు
* బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఫలితాలపై నిరాశ చెందాల్సిన అవసరం లేదని ఈ ఫలితాలు మరింత ఉత్సాహాన్ని నింపాయని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఆయన మీడియా తో మాట్లాడారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీఆర్ ఎస్సే అని ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. గత రెండేళ్లుగా బీఆర్ ఎస్ పోషిస్తున్న ప్రతిపక్ష పాత్రను ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. రాజకీయాలకు కొత్త అయినా మాగంటి సునీత తన గెలుపు కోసం అహన్నిషలు కృషి చేశారని , మాగంటి సునీతకు మంచి రాజకీయ భవిష్యత్ ఉందని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ప్రజా సమస్యలపై పోరాటం ఆపమని కేటీఆర్ స్పష్టం చేశారు.మేం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో మా పార్టీ ఎప్పుడూ ఓడిపోలేదని అన్నారు. ఉప ఎన్నికలు సహజంగానే అధికార పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుందన్నారు.
ఇదొక అవాంతరం మాత్రమే
రానున్న రోజుల్లో కార్యకర్తలు కష్టపడి మళ్లీ కేసీఆర్ ను ముఖ్యమంత్రి గా చేయాలని కేటీఆర్ అన్నారు. కష్ట పడితే ఫలితం ఉంటుందన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలహీన పడిందన్నారు. అందుకు ఉదాహరణే
బీహార్ ఎన్నికల ఫలితాలు అన్నారు. ఎన్నికల ఫలితాలను సమీక్షించుకొని మళ్లీ కొత్త ఉత్సాహంతో పనిచేస్తామని కేటీఆర్ అన్నారు.
………………………………………………………..
