* మేం ప్రత్యక్షంగా చూశాం
* బీఆర్ ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఇటీవల హోరాహోరీగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు రేపే విడుదల కానున్నాయి. పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కే విజయ అవకాశాలు ఉన్నాయని వెల్లడైంది. రేపు సంబరాలకు కూడా కాంగ్రెస్ నేతలు సిద్ధం అవుతున్నారు. ఇటువంటి క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బోగస్ ఓటింగ్ జరిగిందని, ఓల్డ్ సిటీలో బోగస్ ఓటింగ్ గురించి కాంగ్రెస్ (Congress) నేత ఫిరోజ్ ఖాన్ చెప్తుంటే విన్నాం.. కానీ జూబ్లీహిల్స్‌లో తాము ప్రత్యక్షంగా చూశామని తెలిపారు. పోలీసులు కూడా బోగస్ ఓటింగ్‌కు సహకరించారని ఆరోపించారు. ఎంఐఎం కూడా అక్రమాలకు పాల్పడి కాంగ్రెస్ పార్టీకి సహకరించిందని, ఎన్ని అక్రమాలు చేసినా ధర్మమే గెలుస్తుందని నమ్ముతున్నాను అని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్(Telangana Bhavan) లో దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వ తీరుపై కూడా విమర్శలు చేశారు. రెండేళ్లలో రూ. 3.48 లక్షల కోట్ల భారీ అప్పులు చేసి ఆర్థిక అత్యాచారానికి పాల్పడ్డాడని అన్నారు. ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్‌ను రూ. 2 లక్షల 30 వేల కోట్లుగా ప్రతిపాదించినా, సెప్టెంబర్ నాటికి రూ. 76 వేల కోట్లు మాత్రమే విడుదలయ్యాయని తెలిపారు. లక్ష్యంలో 33 శాతం మాత్రమే చేరుకున్నట్లు వెల్లడించారు. రెవెన్యూ వసూళ్లలో 40 శాతం మాత్రమే సాధించారన్నారు.
