KTR - Harish Rao Arrest
* పీఎస్కు తరలించిన పోలీసులు
* ఎర్రవల్లి వద్ద భారీ బందోబస్తు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఎర్రవల్లి వైపు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వద్దకు వెళ్లేందుకు కేటీఆర్, హరీష్ రావులతో పాటు BRS ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు బయలుదేరారు. మార్గమధ్యలో బొల్లారం, హకింపేట్ వద్ద పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి BRS నేతల వాహనాలను నిలిపివేశారు. పోలీసులు తమ పర్యటనను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కేటీఆర్, హరీష్ రావు తమ వాహనాల నుంచి దిగి ఎర్రవల్లి వైపు పాదయాత్రగా బయలుదేరారు.
పోలీసులు మళ్లీ వారిని అడ్డుకోవడంతో కేటీఆర్, హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రోడ్డుపైనే బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో పోలీసులు, BRS నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు పోలీసులు కేటీఆర్, హరీష్ రావులతో పాటు పలువురు BRS నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ప్రత్యేక పోలీస్ వాహనాల్లో స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ అరెస్టులతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, ఎలాంటి విపరీత పరిణామాలు చోటుచేసుకోకుండా పోలీసులు ఎర్రవల్లి పరిసరాల్లో భారీగా బందోబస్తు పెంచారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
