
ఆకేరు న్యూస్, కమలాపూర్ : కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐ దర్యాప్తు సంస్థకు అప్పగించడానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం కమలాపూర్ మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు హుజురాబాద్ – పరకాల ప్రధాన రహదారిపై భారీ ధర్నా చేపట్టారు. గణపతి బప్పా మోరియా దొరుకుత లేదయ్యా యూరియా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రజల కోసమే కాలేశ్వరం ప్రాజెక్టు
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మారపల్లి నవీన్ కుమార్ మాట్లాడుతూ..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నీళ్లు,నిధులు,నియామకాల కొరతను తీర్చడానికి కట్టిన ప్రాజెక్టు కాలేశ్వరం అని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు తీర్చలేక, స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్లడానికి కాళేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపిస్తుందని ఆరోపించారు.రైతులకు బీఆర్ఎస్ హయాంలో యూరియా కొరత రాలేదని,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు యూరియా అందించడంలో విఫలమైందని అన్నారు.సిబిఐ ని కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాకుండా యూరియా కొరత పైన వేయాలని డిమాండ్ చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన చోట లక్షల క్యూసెక్కుల నీరు నిల్వ ఉందని అన్నారు. పిసి గోష్ కమిటీ కాదని అది పూర్తిగా పీసీసీ కమిటీ అని అన్నారు. ఎస్సార్ఎస్పీ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని, రైతులకు సరిపడా యూరియా వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
………………………………..