- మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి
Bade Nagajyothi| ఆకేరు న్యూస్, ములుగు: 14న ములుగు నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయడానికి జిల్లా, మండల స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు.
రైతులకు విద్యుత్ కష్టాలు: నాగజ్యోతి
ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించారని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కనీసం ఆరు గంటల పాటు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా చేయలేకపోతోందని ఆరోపించారు.
విద్యుత్ కోతల కారణంగా పంటలకు సకాలంలో నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
అన్ని మండలాల్లో నిరసనలు
రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ములుగు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు సమన్వయంతో ఈ కార్యక్రమాల్లో పాల్గొని రైతుల సమస్యలపై గళమెత్తాలని నాగజ్యోతి కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

