
* వెల్లడిరచిన మాజీ సీఎం కేసీఆర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశమైంది. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు, సిల్వర్ జూబ్లీ వేడుకలు, పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించారు. పార్టీ సిల్వర్‌జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏడాది పొడవునా ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించాలని శ్రేణులకు సూచించారు. అలాగే, పార్టీ కమిటీలు వేయాలని నిర్ణయించిన కేసీఆర్.. కమిటీలకు ఇన్చార్జ్గా హరీశ్‌రావుకు బాధ్యతలు అప్పగించారు. అలాగే త్వరలోనే మహిళా కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏప్రిల్ పదో తేదీ నుంచి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని.. ప్రతి జిల్లా కేంద్రంలో పార్టీ సభ్యత్వ నమోదు కొనసాగుతుందన్నారు. అనుబంధ సంఘాల పటిష్టత కోసం సీనియర్ నేతలతో సబ్ కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. అదే నెల 10న పార్టీ ప్రతినిధుల సభ ఉంటుందన్నారు.
…………………………………….