
* మూకుమ్మడిగా కమిషనర్ కార్యాలయానికి బీఆర్ ఎస్ నేతలు
* పదేండ్లలో లేని కొరత ఇప్పుడు ఎలా ఇచ్చింది : హరీష్ రావు
* రైతులకు వెంటనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్
* కమిషనర్ కు వినతిపత్రం సమర్పించిన బీఆర్ ఎస్ నేతలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో యూరియా(URIA) కొరతపై బీఆర్ ఎస్ (BRS)నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ నుంచి నేరుగా బషీర్బాగ్ (BASHEERBAGH)లో ఉన్న వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయానికి యూరియా కొరతపై ప్లకార్డులు పట్టుకొని ర్యాలీగా వెళ్లారు. యూరియా కొరతపై వ్యవసాయ శాఖ కమిషనర్ ను నిలదీశారు. ఈ సందర్భంగా హరీష్ రావు (HARISH RAO) పదేండ్లలో లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందని నిలదీశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రణాళిక లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని కమిషనర్ ను హరీష్ నిలదీశారు. బీఆర్ ఎస్ హయాంలో కరోనా లాంటి విపత్తు సమయంలో కూడా రైతులకు యూరియా సరఫరా చేశామని అన్నారు. రైతులను రోడ్ల మీదికి ఈడ్చారని హరీష్ రావు మండి పడ్డారు. పనులు వదిలి రైతులు గంటల తరబడి వర్షంలో తడుస్తూ యూరియా కోసం పడిగాపులు పడుతున్నారని హరీష్ అన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి హామీ ఇచ్చేంత వరకు ఇక్కడనుంచి కదిలేది లేదని హరీష్ అన్నారు. తక్షణమే యూరియా కొరత తీర్చాలంటూ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. హరీష్ రావుతో పాటు కేటీఆర్(KTR),నిరంజన్ రెడ్డి,(NIRANJAN REDDY)జగదీష్ రెడ్డి,(JAGADEESH REDDY)కొత్త ప్రభాకర్ రెడ్డి,(KOTHA PRABHAKAR REDDY)దాసోజు శ్రవణ్(DASOJU SHRAVAN),మధుసూదనా చారి, (MADHUSUDHANA CHARY)సబితా ఇంద్రారెడ్డి,(SABITHA INDRA REDDY) సునిత లక్ష్మారెడ్డి,(SUNITHA LAXMA REDDY)పాడి కౌశిక్ రెడ్డి(PADI KOUSHIK REDDY), గంగుల కమలాకర్(GANGULA KAMALAKAR) తదితరులు ఉన్నారు.
…………………………………………