* అలియాబాద్లో ఉద్రిక్తత
* ఎన్నికల ప్రచారంలో ఉండగా ఘటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మేడ్చల్ లో కాంగ్రెస్, బీఆర్ ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే మల్లారెడ్డి వాహనం ధ్వంసమైంది. మల్లారెడ్డి అనుచరుడు ఢిల్లీ పరమేశ్ పై డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ దాడికి పాల్పడినట్లు తెలిసింది. అలియాబాద్ లోని లాల్ గడి మలక్పేట ప్రాంతంలో మల్లారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. మల్లారెడ్డి మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ శ్రేణులు పాటలు పెట్టారు. సౌండ్ తగ్గించాలని బీఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ శ్రేణులను కోరారు. సౌండ్ తగ్గించకపోవడంతో బీఆర్ ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య గొడవ ప్రారంభమైంది. వాగ్వాదం ముదరడంతో డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ దాడికి పాల్పడినట్లు బీఆర్ ఎస్ శ్రేణులు ఆరోపించారు. ఇరు పార్టీ కార్యకర్తలు, నేతల వాగ్వాదాలు, ఘర్షణలతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
……………………………………….
