* సర్పంచుల పెండింగ్ బిల్లులపై ప్రభుత్వ తీరుకు నిరసన
ఆకేరున్యూస్, హైదరాబాద్: సర్పంచుల బకాయిల చెల్లింపులపై స్పష్టమైన ప్రకటన చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిమాండ్ చేసినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసింది. అసెంబ్లీలో సర్పంచుల పెండిరగ్ బిల్లులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్న లేవనెత్తారు. సంవత్సంం నుంచి పెండిరగ్ బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నదని విమర్శించారు. చివరికి వారు గవర్నర్, మంత్రులను కలిసి మొరపెట్టుకున్నారని అయినా లాభం లేదని చలో అసెంబ్లీకి పిలుపునిస్తే వారిని అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
……………………………….