
* భారత్కు అప్పగించిన పాకిస్థాన్
ఆకేరు న్యూస్, డెస్క్ : అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దు దాటిన బీఎస్ ఎప్ జవాన్ ను 20 రోజుల తర్వాత పాక్ రేంజర్లు విడుదల చేశారు. -వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్ రేంజర్స్ జవాన్ పూర్ణమ్ కుమార్ సాహు (PURNAM KUMAR SHAW)ను బీఎస్ఎఫ్కు అప్పగించారు. 20 రోజులకు పైగా పూర్ణమ్ కుమార్ పాక్ కస్టడీలో ఉన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన ఒక రోజు తర్వాత పాకిస్థాన్ సైన్యం పూర్ణమ్ సాహును అదుపులోకి తీసుకుంది. పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో బీఎస్ఎఫ్ 182వ బెటాలియన్లో పూర్ణమ్ సాహు పనిచేస్తున్నారు. ఏప్రిల్ 23న అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దు దాటాడు. అనంతరం పాకిస్థాన్ (PAKISTHAN) రేంజర్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ సైన్యం సాహును అదుపులోకి తీసుకున్న సమయంలో అతని వద్ద సర్వీస్ రైఫిల్ ఉంది. సరిహద్దు దగ్గర రైతులను కాపాడే క్రమంలో సాహు సరిహద్దును దాటినట్లు బీఎస్ఎఫ్ (BSF) అధికారులు తెలిపారు. ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లి అనుకోకుండా పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించగా.. అతడిని పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
…………………………………………