ఆకేరు న్యూస్, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఒక వ్యక్తి దగ్గర బుల్లెట్ ఉండడం చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. లగేజ్ బ్యాగ్ ని భద్రత అధికారులు తనిఖీలు చేయగా అందులో బుల్లెట్ ఉండడం గమనించారు. ఆ వ్యక్తి తిరుపతి నుంచి వచ్చినట్టు సమాచారం. వెంటనే అక్కడున్న పోలీస్ సిబ్బంది అప్రమత్తమై అతనిని అదుపులోకి తీసుకున్నారు, దీంతో అక్కడున్న సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఆ బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
