
ఆకేరున్యూస్, నల్లగొండ: రోజుమాదిరిగానే పొలంలోకి వెళ్లిన రైతు ఒక్కసారిగా అక్కడ నోట్ల కట్టలు ప్రత్యక్షమవ్వటంతో ఒక్కసారి షాక్కు గురయ్యాడు. ఇన్నీ రోజులు పడ్డ కష్టాలు ఈ డబ్బులతో తీరిపోతాయని ఆశపడ్డాడు.. కానీ చివరకు అవి అసలు నోట్లు కాదు.. నకిలీ నోట్లని తేలడంలో ఆ రైతు ఆశలు కాస్త ఆవిరయ్యాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పొత్తలపాలెం వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఓ రైతు మంగళవారం ఉదయం తన పంట పొలానికి బయల్దేరాడు. నార్కట్పల్లి-అద్దంకి రోడ్డు వెంట తన దాయాది పొలంలోసుమారు 40 వరకు రూ.500 నోట్ల కట్టలు పేర్చి ఉన్న సంచిని గుర్తించాడు. అందులో ఉన్న డబ్బును మరో రైతుతో కలిసి పరిశీలించి చూడగా.. అవి నకిలీ నోట్లను తేలింది. విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో మిర్యాలగూడ గ్రామీణ సీఐ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. పొలంలోని రూ. 500 నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫేక్ కరెన్సీపై ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని ముద్రించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అవన్నీ ఫేక్ కరెన్సీ అని పోలీసులు వెల్లడిరచారు. అసలు ఈ నోట్లు అక్కడికి ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విచారణ తర్వాత వాటిని అక్కడ ఎవరు పడేశారు? ఎందుకు వినియోగిస్తున్నారనే విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
……………………………