
ఆకేరున్యూస్, కమలాపూర్: కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే గేట్ వద్ద సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు కారును ఢీకొన్నది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హుజురాబాద్ నుంచి పరకాలకు వెళ్తుండగా.. రైల్వే గేట్ వద్దకు బస్సు రాగానే.. అదే సమయంలో రైల్వే గేట్ ఓపెన్ అయింది. ఈ సమయంలో డ్రైవర్ బస్సు వేగం పెంచడంతో అదుపుతప్పిన బస్సు కారును ఢీ కొట్టింది. దీంతో కారు వెనక భాగం ధ్వంసమవగా.. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు.
రైల్వే ఓవర్ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలి..
వెంగళ రవీందర్
ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం నత్త నడకన సాగుతుంది. రైల్వే బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలి. హుజురాబాద్ – పరకాల మధ్యన ఉన్న రైల్వే గేటు కావడంతో వేలాదిమంది ప్రయాణికులు రైల్వే గేట్ పడటంతో గేట్ వద్ద పడికాపులు కాస్తున్నారు. ఉప్పల్ రైల్వే స్టేషన్లోని డంపింగ్ వల్ల గేటు వద్ద రోడ్డు ధ్వంసం అవుతుంది. తీవ్రమైన దుమ్ము ధూళి రోడ్డుపై పేరుకుపోతుంది. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి తదితర పుణ్యక్షేత్రాలకు వేలాదిమంది భక్తులు ఇదే ప్రధాన రహదారి గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. గంటల తరబడి రైల్వే గేటు పడటంతో ప్రయాణికులు,వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్ఓబి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి.
…………………………………..