
* పండుగ ప్రయాణాలకు అంతరాయం
* బస్స్టేషన్లకు వచ్చి వెనుతిరుగుతున్న ప్రజలు
* జనంతో కిక్కిరిసిన బస్టాండ్లు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : బీసీ బంద్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్ జరుగుతున్న నేపధ్యంలో
టీజీఎస్సార్టీసీ బస్సులను నిలిపి వేసింది. దీంతో బస్లన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. వీకెండ్ తో పాటు దీపావళి తోడు కావడంతో ప్రజలు తమ తమ ఊళ్లకు పయనమయ్యారు. బీసీ బంద్ పిలుపు పై సమాచారం లేక కొంత మంది ప్రయాణికులు ఆయా ఊళ్లకు వెళ్లడానికి బస్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. బస్ లు డిపోల వరకే పరిమితం కావడంతో జనాలు చేసేదిలేక ఉసూరు మంటూ వెనుతిరుగుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన బస్ స్టేషన్లలో ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా వృద్ధులు చిన్న పిల్లలు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార సంస్థలు కూడా మూసి వేయడంతో తినడానికి దొరకని పరిస్థితి ఉంది. కొంత మంది వచ్చిన దారినే వెనుతిరిగి వెళ్తుంటే మరి కొంత మంది ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ వాహనాల యాజమాన్యాలు చార్జీలను విపరీతంగా పెంచారు. ఉన్న చార్జీ కంటే డబులు వసూలు చేస్తున్నారు. సాయంత్రం వరకు బస్ లు నడిచే అవకాశం ఉంటుందేమోనని కొంత మంది ప్రయాణికులు బస్ స్టేషన్ లోనే పడిగాపులు గాస్తున్నారు.
……………………………………..