
ఆకేరున్యూస్, మహబూబ్‌నగర్: దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో క్యాడవర్ డాగ్స్ మృతదేహాల ఆచూకీని గుర్తించడానికి మరోసారి లోపలికి వెళ్లాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం నేపథ్యంలో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటిని నియమించగా.. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 34 రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయక బృందాలు నిరంతరాయంగా కృషి చేస్తున్నాయని, రోజుకు మూడు షిఫ్టులుగా 600 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని వెల్లడిరచారు. చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు కేరళకు చెందిన ప్రత్యేక శిక్షణ పొందిన క్యాడవర్ డాగ్స్‌ను టన్నెల్లోకి పంపినట్లు శివశంకర్ వెల్లడిరచారు.
………………………………….