
* కాంగ్రెస్ పార్టీ నేత ప్రణవ్
* కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ,,బిఆర్ఎస్ నాయకులు
ఆకేరున్యూస్ వీణవంక : ప్రజాస్వామ్య వ్యవస్థకి మూల కారణమైన ఓటు హక్కును బీజేపీ ప్రభుత్వం హరిస్తుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు.శుక్రవారం రోజున వీణవంక మండల కేంద్రంలో నూతనంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ వీణవంకలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉందని ప్రజలకు మరింత సేవ చేసేందుకు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యాలయం ఉపయోగించుకోవాలని సూచించారు.దేశంలో బీజేపీ పార్టీ ఏ విధంగా ఓటు చోరీ చేస్తుందో రాహుల్ గాంధీ వివరించి చెప్పారని,దీనిపై ఎన్నికల సంఘం స్పష్టమైన ఆధారాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్,పీసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో గ్రామ గ్రామాన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దాంట్లో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో వీణవంకలో మొదలు పెట్టామని అన్నారు.ఈ మేరకు డిక్లరేషన్ ఫాం పై ప్రణవ్ సంతకం చేసి డీసీసీ కార్యాలయానికి పంపారు.అదే విధంగా బూత్ స్థాయి నుండి గ్రామ గ్రామాన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేసి పంపాలని దీన్ని ఐదు రోజుల్లో పూర్తి చేయాలని కోరారు.ప్రజల్లో ఓటు చోరీపై విసృతంగా ప్రచారం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వీణవంక మండల నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు..
వీణవంక మండల పరిధిలోని మల్లన్నపల్లి,ఘన్ముక్ల గ్రామాల నుండి పెద్ద ఎత్తున బీజేపీ,బిఆర్ఎస్ పార్టీల నుండి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ మేరకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ప్రణవ్.కష్టపడ్డ ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుంది అని,ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వీణవంక మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.
……………………………………………..