* త్రిశంకు స్వర్గంలో మడికొండ టైక్స్ టైల్ పార్క్
* ప్రభుత్వ ప్రచారం ఎక్కువ.. సహకారం తక్కువ
* పార్క్ పూర్తి స్థాయిలో నడిస్తే 10 వేల కుటుంబాలకు ఉపాధి
* పరోక్షంగా వేల కుటుంబాలకు లబ్ధి
* ఫ్యాక్టరీ ఆధారంగా పెరిగే ఇతర ఉపాథి అవకాశాలు
* పట్టించుకోని ప్రభుత్వాలు
* నైరాశ్యంలో నేతన్నలు
ఆకేరు న్యూస్ డెస్క్ : ఒకప్పుడు చేనేత రంగంలో ఓ వెలుగు వెలిగి ఎంతోమంది
చేనేత కుటుంబాలకు ఆధారంగా నిలిచిన ఓరుగల్లు ప్రాంతం ఇప్పుడు
చేనేతకు చేయూత కరువై దిక్కుతోచని స్థితిలో ఉంది.. ఓరుగల్లు అంటేనే
కాకతీయుల కోట.. వేయి స్తంబాల గుడి తో పాటు ఆజాంజాహి మిల్లు గుర్తుకు వచ్చేది
ఆజాం జాహి మిల్లు ఇప్పుడు ఓ జ్ఞాపకంగా మిగిలి ఉంది. ఆజాం జాహి సైరన్
మోగిందంటే కార్మికులు ఉరుకులు పరుగులు పెట్టిన జ్ఞాపకాలు ఇంకా
మదిలో మెదలుతాయి.. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల కారణంగా
క్రమక్రమంగా ఆజాంజాహి మిల్లు మరుగనపడింది.. కొత్తవాడలో
కొత్తదనం లోపించింది.. ఉపాధి అవకాశాల కోసం నేతన్నలు సూరత్ భీవండీ
షోలాపూర్..బొంబాయి ప్రాంతాలకు పొట్టచేత పట్టుకొని వలసలు పోయారు..
ఆర్భాటం ఎక్కువ.. ఆదరణ తక్కువ
వలసలు పోతున్న నేతన్నలకు ఉన్న చోటే ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో
2004లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఘర్ వాపసీ
పేరుతో నేతన్నలకు ఉన్న చోటే ఉపాధి కల్పించడానికి సంకల్పించింది.
ఆలోచన మంచిదే కానిఇంత వరకు అది పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చకపోవడం బాధాకరం
అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కుటుంబాలకు దూరంగా వెళ్లిన
వందల మంది నేతన్నలు తిరిగి ఇంటిముఖం పట్టారు.
మడికొండ ప్రాంతంలో టెక్స్టైల్ పార్కుకు స్థలం కేటాయింపు
మడికొండ ప్రాంతంలో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయడానికి 2011లో ప్రభుత్వం 60 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించింది.. అప్పట్లో ఎంపీగా ఉన్న సిరిసిల్ల రాజయ్య టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు.సూరత్ తదితర ప్రాంతాలనుంచి వచ్చిన చేనేత కార్మికులు కాకతీయ పొదుపు సహకార సంఘంగా ఏర్పడ్డారు. అయితే 500 యూనిట్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 364 మందికి ల్యాండ్ అలాట్ చేశారు. 2014లో తెలంగాణ రాష్ట రాష్ట్రం ఏర్పడ్డ తరువాత అప్పటి ముఖ్యమంత్రి కేసీ ఆర్ మళ్లీ చొరవతీసుకొని యూనిట్ల సనులను మందుకు సాగేలా చేశారు. యూనిట్ల నిర్మాణానికి 2019లో బ్యాంకు లోన్ మంజూరు కాగా 2020లో యూనిట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు.
కరోనాతో బ్రేక్..
2019లో కరోనా మహమ్మారి వల్ల యూనిట్ల నిర్మాణం ఆగిపోయింది. ఈ నేపధ్యంలో పనులు ఆలస్యం కావడం వల్ల ముందు అనుకున్న అంచనా వ్యయం కంటే నిర్మాణ వ్యయం పెరిగింది. దీంతో నిధుల కొరత మొదలైంది. ఆ తరువాత సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా జీసీఎల్ లోన్ మంజూరు అయింది. అప్పటి వరకు రిలీజ్ అయిన లోన్ లో 30 శాతం లోన్ మంజూరు అయినా బ్యాంకు వారు ఫండ్ రిలీజ్ చేయకుండా హోల్డలో పెట్టుకున్నారు. ఇది వరకు ఇచ్చినలోన్ లోనే ఈఎంఐ రికవరీ చేయడంతో యూనిట్ల నిర్మాణానికి నిధుల కొరత ఎక్కువైంది. అయినా కూడా 164 యూనిట్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం 70 నుంచి 80 యూనిట్లలో ప్రొడక్షన్ జరుగుతోంది.
ఉపాధి అవకాశాలు మెరుగు
మడికొండ్ టెక్స్టైల్ పార్క్ పూర్తి స్థాయిలో అంటే 364 యూనిట్లు పూర్తి స్థాయిలో పని చేస్తే దాదాపు 6వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా 24 వేల కుటుంబాలకు ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. పరోక్షంగా ఎంతో మంది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్ పోర్టు, ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు ఇలా కొన్ని వందల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఒక వేళ 364 యూనిట్లు 3 షిఫ్టల్లో పనిచేస్తే 10 వేల మంది కార్మికులకు ఉపాధి లభించే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల యూనిట్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది.
మౌలిక సదుపాయాలు..
టెక్స్టైల్ కు సంబంది అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. స్పన్నింగ్, నేత ప్రొసెసింగ్ కోసం ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. వస్త్ర పరిశ్రమకు మద్దతు ఈ టెక్స్టైల్ పూర్తి స్థాయిలో పని చేస్తే ముడిపదార్థాల ప్రొసెసింగ్ నుంచి వస్తాల విలువ వరకు అన్ని విభాగాలు చురుకుగా పనిచేసే అవకాశం ఉంది.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి స్థానిక చేతి వృత్తుల వారికి ఊతం లభిస్తుంది. చేతి వృత్తుల వారు తమ కార్యకలాపాలను మరింత పెంచుకునే అవకాశం లభిస్తుంది.దేశీయంగా అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్న ఉత్పత్తులపై దృఫ్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. ఏది ఏమైనా మడికొండ టెక్స్ టైల్ పూర్తి స్థాయిలో పనిచేస్తే ఓరుగల్ల ప్రాంతానికి గత వైభవం మళ్లీ వచ్చే అవకాశం ఉంది.
……………………………………………
