* ఇసుక లారీని ఢీకొట్టిన రాజధాని బస్సు
* అక్కడికక్కడే ఇద్దరు మృతి.. ఆరుగురికి తీవ్ర గాయాలు
* ప్రమాద తీవ్రతకు బస్సు ముందుభాగం ధ్వంసం
ఆకేరు న్యూస్, జనగాం : రాష్ట్రంలో రోజుకో బస్సు ప్రమాదం చోటు చేసుకుంటుంది. బస్సు ప్రయాణం అంటేనే ప్రజలు బయపడుతున్నారు. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అవడంతో ఆసుపత్రికి వరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారిలో పులమాటి ఓం ప్రకాష్ తండ్రి శంకరయ్య(75), దిండిగల్, నవదీప్ సింగ్ తండ్రి ముంజిత్ సింగ్ హన్మకొండకలోని బాలసముద్రం, హైదరాబాద్‌లోని దోమలగూడకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వరంగల్ 1 డిపోకు చెందిన రాజధాని బస్సు వేగంగా వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై రాజధాని బస్సు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. బస్సు డ్రైవర్ని జనగామ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు స్థానికుల సమాచారం. వరుస బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా ఆర్టీసీ డ్రైవర్లలో మార్పు రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద తీవ్రను కళ్లారా చూస్తున్న జనం ఆందోళన చెందుతున్నారు.
…………………………………………
