
– మహానగరంలో ఇప్పటికీ మట్టిరోడ్లు
– పలు ప్రాంతాలకు దారులు కరువు
– వర్షాకాలంలో మరింత దరిద్రం
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
విశ్వ నగర వెలుగులు.. రాత్రయితే ధగధగలు.. ఆకాశ హర్మ్యాలు.. భారీ భవంతుల హైదరాబాద్ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లోని రోడ్లు మారుమూల గ్రామాలను తలిపిస్తుంటాయి. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌గా రూపాంతరం చెంది ఏళ్లు గడిచినా పలు ప్రాంతాలకు మట్టి రోడ్లే దిక్కు. కొన్ని కాలనీలు, బస్తీల్లో మౌలిక సదుపాయాలు లేవు. అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు 800 కిలోమీటర్ల మేర మట్టి రోడ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కొత్త కాలనీలు, బస్తీల్లో రహదారుల నిర్మాణం సరిగ్గా జరగడం లేదు. అధికారులకు విజ్ఞప్తి చేసినా, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా నిధుల కొరత పేరిట పనులు చేపట్టడం లేదు. దీంతో పేరుకు హైదరాబాద్‌లో ఉంటున్నామని చెప్పుకుంటున్నా, కొన్ని ప్రాంతాల్లో వసతులు మాత్రం పల్లెటూర్ల కంటే అధ్వానంగా ఉండడం గమనార్హం.
మట్టి రోడ్లున్న కొన్ని ప్రాంతాలు
జగద్గిరిగుట్ట సంజయ్‌పురి కాలనీ, చంద్రనాయక్ తండా, గోకుల్ ప్లాట్స్, గోపన్‌పల్లి ఎన్టీఆర్ నగర్, నవోదయ కాలనీ, గచ్చిబౌలిలోని రాజీవ్‌నగర్, చిన్ని అంజయ్యనగర్, రాయదుర్గంలోని కట్టెల బస్తీ, గౌలిదొడ్డి కేశవనగర్, టీఎన్జీఓ కాలనీ, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హయత్‌నగర్ డివిజన్ ముదిరాజ్ కాలనీ. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాలవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
…………………………………………………..