* మృతుల్లో అయిదుగురు వైద్య విద్యార్థులు
* ఏపీలోని నెల్లూరు జిల్లాలో ప్రమాదం
* నిశ్చితార్థానికి వెళ్లి వస్తుండగా ఘటన
ఆకేరు న్యూస్, నెల్లూరు : జిల్లాలోని కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద ఓ ఇంట్లోకి కారు దూసుకెళ్లడంతో ఘోర ప్రమాదం (Accident) జరిగింది. ఆరుగురు దుర్మరణం చెందారు. బుచ్చిరెడ్డి పాలెంలో నిశ్చితార్థానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ముంబయి జాతీయ రహదారి(Mumbai National Highway) పై ఉన్న పెట్రోలుబంకు వద్దకు రాగానే కారు అదుపుతప్పి అక్కడే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివశిస్తున్న వెంకట రమణయ్య (50) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు విద్యార్థులకు తీవ్రమైన గాయాలయ్యాయి. బెచ్చిరెడ్డి పాలెంలో స్నేహితుడి అక్క నిశ్చితార్థానికి వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో స్థానికులు పోలీసులకు, 108 సిబ్బందికి ఫోన్ చేశారు. వారు ఘటనాస్థలికి వచ్చి గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. నెల్లూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అయిదుగురు వైద్య విద్యార్థులు సైతం మృతి చెందారు. మృతులను జీవన్, విఘ్నేశ్, నరేశ్, అభిసాయి, అభిషేక్ గా గుర్తించారు. మరో విద్యార్థి మౌనిక్ రెడ్డి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వీరంతా నెల్లూరు నారాయణ కళాశాల(Narayana College)లో మెడిసిన్ చదువుతున్నట్లు తెలిసింది.
………………………………….
