
* ఇద్దరికీ తీవ్ర గాయాలు
* గాయపడ్డ వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించిన సీఐ హరికృష్ణ
ఆకేరున్యూస్, కమలాపూర్ : బైక్‌ను కారు ఢీకొనడం వల్ల ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ – భీంపల్లి రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కమలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ కథనం ప్రకారం ఆదివారం ఉదయం కమలాపూర్ కు చెందిన ఎడ్ల క్రాంతికుమార్ తన అన్న ఎడ్ల కరుణాకర్ ను జమ్మికుంట లో ట్రైన్ ఎక్కించడానికి , కమలాపూర్ నుండి బైక్ పై వెళ్తుండగా బీంపెల్లి మత్తడి దగ్గర ఎదురుగ వస్తున్న కన్నూరు గ్రామానికి చెందిన దుర్గం కుమారస్వామి కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఎడ్ల క్రాంతికుమార్,ఎడ్ల కరుణాకర్ లకు కాళ్లు,చేతులకు తీవ్ర గాయాలయ్యాయని సిఐ తెలిపారు. హుటాహుటిన క్షతగాత్రులను 108 వాహనంలో వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించినట్లు సిఐ హరికృష్ణ తెలిపారు. క్షతగాత్రులలో ఎడ్ల క్రాంతికుమార్ సింగరేణి ఎంప్లాయ్ విధులు నిర్వహిస్తుండగా,ఎడ్ల కరుణాకర్ ఢల్లీి లో ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తున్నాడని సిఐ హరికృష్ణ తెలిపారు.
…………………………….