* ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి, ఏడుగురికి గాయాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ ఆర్)పై కారు పల్టీలు కొట్టి బోల్తా పడింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇన్ఫోసిస్ ఉద్యోగులు సరళ మైసమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా అబ్దుల్లాపూర్మెట్ ఓఆర్ ఆర్ సమీపంలో కారు పల్టీలు కొట్టి బోల్తా పడింది . ఈ ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామానికి చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని సౌమ్యారెడ్డి మృతి చెందింది. మరో ఏడుగురు ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఝాన్సీ, శృతి, అరవింద్, నంద కిశోర్, వీరేంద్ర, ప్రనీష్, సాగర్, ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
……………………………………….
