
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : టాలీవుడ్ నటి కల్పిక వివాదంలో చిక్కుకున్నారు. పబ్ లో జరిగిన గొడవ కారణంగా ఆమెపై కేసునమోదు చేశారు. వివరాల్లోకి వెళితే ..గత నెల 29న తన పుట్టిన రోజు సందర్భంగా నటి కల్పిక ప్రిజం పబ్ లో తన స్నేహితులకు విందు ఇచ్చారు. ఈ నేపధ్యంలో కేక్ విషయంలో కల్పికకు పబ్ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఈ నేపధ్యంలో కల్పిక పబ్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించాంటూ పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిల్ చెల్లించకుండా సిబ్బందిపై దుర్భాషలాడిన్టు యాజమాన్యం ఫిర్యాదులో పేర్కొంది. దానికి సంబందించిన వీడియో రికార్డులను పోలీసులకు సమర్పించింది. దీంతొ గచ్ బౌళి పోలీసులు కోర్టు అనుమతితో ఆమెపై కేసు నమోదు చేశారు. గచ్బౌళి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా గచ్ బౌళి పోలీసులు కోర్టు అనుమతితో ఆమెపై కేసునమోదుచేశారు.బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 324(4), 352, 351(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇవిలా ఉండగా పబ్ యాజమాన్యం చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పబ్ సిబ్బందే తనతో దురుసుగా ప్రవర్తించారని కల్పిక వివరణ ఇస్తున్నారు. పబ్ సిబ్బంది .బూతులతో రెచ్చిపోయారని, ఆమె ఆవేదన వ్యక్తం చేశారు .తనను డ్రగ్ అడిక్ట్ అంటూ దూషించడం తనకు బాధ కలిగించిందని ఆమె అన్నారు. . గొడవకు సంబంధించిన వీడియోలను కల్పిక తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. అంతేకాదు.. సోషల్ మీడియా వేదికగా పోలీసుల తీరును కూడా ఆమె ప్రశ్నించారు.
……………………………………..