
ఆకేరున్యూస్, హైదరాబాద్: సంచలనం సృష్టిస్తోన్న బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. యాప్ యజమానులే టార్గెట్‌గా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 19మంది యాప్ ఓనర్లపై కేసులు నమోదు చేశారు. జంగిల్ రమ్మి డాట్ కామ్, ఏ 23, యోలో 247 ఫెయిర్ ప్లే, జీత్‌విన్, విబుక్, తాజ్ 77, వివి బుక్, ధనిబుక్ 365, మామ247, తెలుగు365, ఎస్365 జై365, జెట్ఎక్స్, పరిమ్యాచ్, తాజ్777బుక్, ఆంధ్రా365 యజమానులపై కేసులు ఫైల్ అయ్యాయి. ఇల్లీగల్ బెట్టింగ్‌కు నిర్వాహకులే బాధ్యులని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. వారందరిని నిందితులుగా చేర్చి మియాపూర్ కోర్టులో మెమో దాఖలు చేశారు. యాప్‌ల యజమానులకు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు.
……………………….