
* ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపణ
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : జూబ్లీహిల్స్ బీఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై పోలీసులు కేస నమోదు చేశారు. ఓటర్లను ప్రలోభపెడుతున్నారనే ఆరోపణతో సునీతపై ఆమె కుమార్తె అక్షర పై పోలీసులు కేసు నమోదు చేశారు. సునీతను ఏ1గా, అక్షరను ఏ2గా పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో నమాజ్ కు వెళ్తున్న వారిని ఓటు వేయడానికి ప్రలోభానికి గురి చేసినట్లు చెప్తున్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపధ్యంలో బీఆర్ ఎస్ పార్టీ మాగంటి గోపీనాధ్ సతీమణి మాగంటి సునీతను బీఆర్ ఎస్ అభ్యర్థిగా నిలబెట్టింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాగంటి సునీత తన కూతురు అక్షరతో కలిసి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
……………………………………………………..