
* గడ్జిరోలి ఎమ్మెల్యే మిలింద్ నరోటే ఫిర్యాదు మేరకు..
ఆకేరు న్యూస్ డెస్క్ : ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి , లల్లు ప్రసాద్ తనయుడు తేజస్వీ యాదవ్ పై మహారాష్ట్ర లో కేసు నమోదు అయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM MODI)పై అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టారన్న ఆరోపణలతో పోలీసులు తేజస్వీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు .బీహార్లోని గయా జిల్లాలో ఇటీవలే ప్రధాని మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. ఆ పర్యటన సందర్భంగా ప్రధానిని ఉద్దేశిస్తూ తేజస్వీ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టు పెట్టారంటూ గడ్చిరోలికి (GADCHIROLI) చెందిన బీజేపీ ఎమ్మెల్యే మిలింద్ నరోటే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. తేజస్వీపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
………………………………………….