* కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక పథకాన్ని ప్రకటించారు. రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు నగదు రహిత చికిత్సను అందించేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడితే చికిత్సకు అయ్యే ఖర్చులో గరిష్ఠంగా రూ.1.50 లక్షలు ఈ పథకం ద్వారా ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడిరచారు. కాగా, ఇది మొదటి ఏడు రోజుల చికిత్సకు అయ్యే బిల్లుకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రమాద ఘటన జరిగిన 24 గంటల్లోగా పోలీసులకు సమాచారాన్ని అందిస్తేనే ఈ స్కీం ద్వారా నగదు రహిత చికిత్సను పొందొచ్చని గడ్కరీ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
………………………………………..