
* దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లి విపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలి
* కాంగ్రెస్ బిసి నేతల సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: బీసీ కులగణన సర్వే చేపట్టడం ద్వారా చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కులగణన విషయంలో భవిష్యత్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాహుల్ గాంధీ మనకు ఇచ్చిన అవకాశం ఇదని, దీనిని ప్రజల్లోకి తీసుకుని వెల్లి విపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలన్నారు. కేవలం అంతా సిఎం రేవంత్ చూసుకుంటారని అనుకుంటే కుదరదని అన్నారు. ప్రతి ఒక్కరూ కులాల వారీగా విూటింగ్లు పెట్టి ప్రజలకు వివరించాలన్నారు. దాదాపు 25 రోజుల పాటు తెలంగాణలో పాదయాత్ర చేశారని.. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారన్నారు. రాహుల్ గాంధీ మాట ఇచ్చిన తర్వాతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇచ్చారని సీఎం అన్నారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకే సమగ్రమైన కులగణన చేపట్టామన్నారు. ఈ మేరకు బీసీ కులగణన సర్వేపై ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విపక్షాల తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేస్తూ పూర్తి పారదర్శకంగా సర్వే చేపట్టామని.. అధికారిక కార్యచరణకు అధికార బృందాన్ని వేశామని పేర్కొన్నారు. బిహార్, కర్ణాటక సహా వివిధ రాష్టాల్ల్రోఅధ్యయనం చేశాం. కులగణనలో మూడు రోజుల పాటు ఇళ్ల వివరాలు సేకరించామని.. ఇందుకోసం ప్రభుత్వంలోని 15 శాఖలకు చెందిన అధికారులను నియమించామని.. మొత్తం 8 పేజీలతో ఇంటి యజమాని ఇచ్చిన సమాచారాన్ని సేకరించామని.. 36 వేల మంది డేటా ఆపరేటర్లను అదనంగా నియమించామన్నారు. ఎన్రోలర్గా సమాచారం సేకరించిన వారే డేటా ఎంట్రీ చేశారన్నారు. దాదాపు కోటి 12 లక్షలకుపైగా కుటుంబాలు కులగణన సర్వేలో పాల్గొన్నాయని వివరించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కులగణన ప్రయత్నమే చేయలేదు. న్యాయపరంగా, చట్టపరంగా నిబంధనలకు లోబడి చేశాం. 96.9 శాతం జరిగింది… 3.1 శాతం సర్వే రాలేదు. ఇంత పారదర్శకంగా కులగణన చేపడుతున్నా కొంత మంది నాయకులు ఇంకా చేయించుకోలేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో 4 విభాగాలుగా జనాభా శాతాన్ని చెప్పారని.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో 5 కేటగిరీలున్నాయి. ముస్లింలలో ఓబీసీలను నాడు కేసీఆర్ ప్రభుత్వం విడిగా చెప్పలేదన్నారు. గుజరాత్లో కూడా ఓబీసీ ముస్లింలు ఉన్నారని ప్రధాని చెప్పారు. బీసీల లెక్క తేలితే మాకేంటి.. అని ఆ వర్గం అడుగుతారని భాజపా, భారాస భయపడుతోంది. దేశవ్యాప్తంగా కులగణన చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే.. అన్ని రాష్ట్రాల్లో కులగణన జరుగుతుందన్నారు. కులగణనను కాపాడుకోకపోతే.. బీసీలే నష్టపోతారని.. ఇంత పకడ్బందీగా సర్వే చేసిన రాష్ట్రం ఇకపై కూడా మరొకటి ఉండదని సీఎం అన్నారు. నివేదిక ఆధారంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో సూచనలు ఇవ్వాలని బీసీ సంఘాల నేతలను కోరారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ కార్యాచరణపై సూచనలివ్వాలని కోరారు. బీసీ జనాభా ప్రకారం వారికి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. కేసీఆర్ ,కేటీఆర్, హరీశ్ రావు జనాభా లెక్కల్లోనే లేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇన్ని అవకాశాలు ఇచ్చిన.. వాళ్లు కులగణన సర్వేలో పాల్గొనలేదన్నారు. కులగణన సర్వే లెక్క తప్పైతే ఎట్ల తప్పో వచ్చి చూపించాలన్నారు. ప్రతిపక్షాలు మొండిగా..తొండిగా వాదిస్తున్నారని సిఎం రేవంత్ విమర్శించారు. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడక అని అందుకు సర్వే వివరాలు బయటపెట్టలేదన్నారు. కేసీఆర్ చెప్పిన లెక్కల ప్రకారం బీసీలు తగ్గారు..ఓసీలు పెరిగారని చెప్పారు. కాకి లెక్కలు చెప్పి జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు రేవంత్. కులగణన సర్వే తెలంగాణ దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్ నిలుస్తోందన్నారు . దేశమంతా కులగణన చేయాల్సి వస్తుందని బీజేపీ భయపడుతోందన్నారు. కులగణన నూటికి నూరు శాతం పక్కా అని సీఎం రేవంత్ అన్నారు.కులగణన చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. బీసీ సంఘాలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి.. కులగణనలో తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్ గా నిలువబోతుందన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దన్నారు. సర్వే తప్పు అయితే..ఎట్ల తప్పో చూపించాలని బీజేపీ,బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. కుట్రలో భాగంగానే బీజేపీ,బీఆర్ఎస్ కులగణన సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కులగణన లెక్కలు తప్పు కాదని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కులాల వారీగా సమావేశాలు నిర్వహించి కులగణన లెక్క పక్కా అని మార్చి 10 లోగా తీర్మానం చేయాలని సూచించారు. ఇకపోతే బీసీ నేతల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. పార్టీ నేతలకు ముఖ్యమంత్రి క్లాస్ పీకారు. నేను చేసేది చేసినా.. ఇక విూ ఇష్టం అని నేతలకు సూచించారు. రాహుల్ గాంధీ మనకు ఇచ్చిన ఆస్తి సర్వే.. కర్ర పట్టుకుని కాపాడుకుంటారో లేదో విూ ఇష్టం అని అన్నారు. సర్వే చేసినా నన్ను తిడుతున్నారు.. సర్వేలో కూడా పాల్గొనని వాళ్ళను మంచోడు అంటున్నారని తెలిపారు. సర్వేలో పాల్గొనని వాళ్ళ ఇంటి ముందు డప్పు కొట్టండి.. బలహీన వర్గాల నేతలు కులాల వారిగా సమావేశాలు పెట్టండని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బీసీల కోసం సర్వే చేసిన అని తనకు గర్వంగా ఉందని తెలిపారు. తాను తల ఎత్తుకుని తిరిగే పని చేశానన్నారు.. సర్వే బలహీన వర్గాల భావోద్వేగం.. విూరు కలిసి రండి అని అన్నారు. మిగిలిన విషయాల్లో విభేదించినా ఇబ్బంది లేదు.. కానీ కుల గణన విషయంలో మాత్రం తనకు సహకరించండని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మార్చి 10 లోపు అన్ని సంఘాలతో విూటింగులు పెట్టి చెప్పండి.. ఈ లెక్కలు కాదు.. కూడదు అని అంటే జీవితంలో మళ్ళీ అవకాశం రాదని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ నివేదికను అనాధ చేయకండి.. ఎవరి కులం వారు ఆ సంఘాల సమావేశం పెట్టండని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. కేసీఆర్ సర్వే ఎంత గొప్పగా ఉందో ఎస్సీ, ఎస్టీ ఉప కులాల లెక్క చూస్తే అర్థం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సమగ్ర సర్వేలో ఎస్సీలలో 82 కులాలు అని చెప్పారు.. ఎస్సీ, ఎస్టీ ఉప కులాల సంఖ్య పెరిగింది. సమగ్ర సర్వే అర్థం పర్థం లేని లెక్కలు. సిగ్గుతో బయట పెట్టలేదు. బీఆర్ఎస్, బీజేపీ కోర్టుకు వెళ్లి బీసీ కుల గణన ఆపాలని చూస్తున్నాయి. అందుకే లెక్క సరిగ్గా.. ఆధారాలతో సహా చేశాం. కంప్యూటర్ లోనే కాదు.. సర్వే చేసిన పేపర్ బండిల్ కూడా సిద్ధంగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమావేశంలో పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, విహెచ్, మంత్రులు భట్టి, పొన్నం తదితరులు పాల్గొన్నారు.
……………………………………