* కవిత బెదిరించారన్న సీబీఐ
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ :
లిక్కర్ కేసులో అరెస్టయిన కవిత కస్టడీ పిటిషన్పై ఈరోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. కేసును లోతుగా విచారించేందుకు కవితను ఐదు రోజులు కస్టడీ కోరుతూ కోర్టులో సీబీఐ గురువారం పిటిషన్ దాఖలు చేసింది. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అని, నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 14 కోట్లు తీసుకున్నారని, ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా ఉండబోదని బెదిరించారని పిటిషన్లో సీబీఐ పేర్కొంది. అంతేకాదు.. శరత్ చంద్రారెడ్డి నుంచి కవితకు చెందిన జాగృతి సంస్థకు రూ. 80 లక్షలు అందినట్లు వెల్లడించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కూడా కవిత 50 కోట్లు డిమాండ్ చేశారని, రూ.100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు అందించారని వివరించారు. కవిత సూచనతో మాగుంట శ్రీనివాసులురెడ్డి రూ.25 కోట్లు అందజేశారని ఈ విషయాన్ని శ్రీనివాసులురెడ్డి తన వాంగ్మూలంలో వెల్లడించారని కోర్టుకు సీబీఐ తెలిపింది. అప్రూవర్ల వాంగ్మూలం ఆధారంగా కవితను ప్రశ్నించేందుకే కస్టడీకి అడుగుతున్నట్లు తెలిసింది. వాదనలు విన్న న్యాయస్థానం కవిత సీబీఐ కస్టడీపై కోర్టు ఉత్తర్వులు రిజర్వ్ చేసింది.
—————————