
* వై ఎస్ షర్మిల సంచలన కామెంట్స్
ఆకేరు న్యూస్, అమరావతి: వైఎస్ వివేకానంద హత్య కేసుపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. జగన్ ను కాపాడేందుకే ప్రధాని మోదీ సీబీఐ గొంతు నొక్కారని పేర్కొన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య కేసును తిరిగి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. మోదీ చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారిందన్నారు. వివేకానంద హంతకులను కాపాడుతున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని.. గూగుల్ మ్యాప్ లొకేషన్లు కూడా ఉన్నాయని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు అవినాష్ రెడ్డి సంఘటనా స్థలంలో ఉన్నాడని.. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని షర్మిల తెలిపారు. ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ.. న్యాయం ఎందుకు జరుగడం లేదని ఆమె ప్రశ్నించారు. సీబీఐ విచారణ సరిగా లేదంటూ సునీత చేసిన ఆరోపణలు నిజముందని షర్మిల పేర్కొన్నారు.
…………………………………………