* 88.39 శాతం ఉత్తీర్ణత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీబీఎస్ఈ (CBSE) బోర్డు 10, 12వ తరగతి ఫలితాల కోసం దేశ వ్యాప్తంగా దాదాపు 44 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎన్నో రోజులుగా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. పరీక్షలు పూర్తయి అన్ని రోజులైనా ఫలితాలు ఇంకా విడుదల కాకపోవడంతో నిరాశగా ఉన్నారు. నేడు, రేపు అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్తలను చూసి ఏది నమ్మాలో తెలియక గందరగోళంలో ఉండేవారు. నేటితో వారి గందరగోళానికి తెర పడింది. 12వ తరగతి ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్( సీబీఎస్ఈ) మంగళవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో 88.39 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే 0.41 శాతం ఎక్కువ మంది పాసైనట్లు బోర్డు వెల్లడించింది. విజయవాడ రీజియన్(VIJAYAWADA REGION)లో అత్యధికంగా 99.60 శాతం ఉత్తీర్ణత సాధించారు. తిరువనంతపురంలో 99.32, చెన్నైలో 97.39 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. బెంగళూరులో 95.95, దిల్లీ వెస్ట్‌లో 95.37, దిల్లీ ఈస్ట్‌లో 95.06 శాతం, ప్రయాగ్‌రాజ్‌లో అత్యల్పంగా 79.53 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు పేర్కొంది. సీబీఎస్ఈ వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో వచ్చాయి.
………………………………………….
