* తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో సీసీఐ కేంద్రాన్ని ప్రారంభించాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పాత పద్ధతిలో కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ నారాయణ విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆయన ములుగు జిల్లా కలెక్టర్ కు గ్రీవెన్స్ సెల్ లో వినతి పత్రాన్ని అందించారు . అనంతరం ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లాలో తక్షణమే సిసిఐని ప్రారంభించాలని ములుగు జిల్లా రైతాంగాన్ని , పత్తి రైతులను వెంటనే ఆదుకోవాలన్నారు .ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రేమ శాతాన్ని 12 నుండి 20 శాతానికి పెంచాలని ఎల్ వన్ ఎల్ టు ఎల్ త్రీ పద్ధతిని రద్దు చేయాలని, కిసాన్ కాపాస్ యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పత్తిని కొనుగోలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కావాలని పత్తి రైతులను నిండా దోపిడీ చేయడం కొరకు పత్తి పంటను అమెరిక నుండి దిగుమతి చేసుకొని 11% దిగుమతి సుంకాన్ని ఎత్తివేయడం జరిగిందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భారత రైతాంగాన్ని అప్పుల పాలు చేసి. ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సిసిఐ కేంద్రాన్ని ప్రారంభించి రైతుల వద్ద పాత పద్ధతిలో కొనుగోలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసినారు.కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి అంజాద్ పాషా. హనంకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పిఎం రాజారాం ములుగు జిల్లా రైతు సంఘం నాయకులు సంపత్. సారయ్య తదితరులు పాల్గొన్నారు.

……………………………………………..
