
* రజినీకాంత్ ని స్ఫూర్తిగా తీసుకోవాలి
*టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
ఆకేరు న్యూస్, డెస్క్: కొంత మంది డబ్బు ధ్యాసలో పడి సమాజానికి కీడు చేస్తున్నారని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా ట్రీట్ చేశారు. కొంతమంది సెలబ్రిటీలు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ధోరణితో కొందరు కేవలం డబ్బు కోసం సమాజానికి హానికరమైన బెట్టింగ్ యాప్లను, మోసపూరిత మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఇటువంటి ప్రకటనలు అనేక మంది ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
రజనీని ఆదర్శంగా తీసుకోవాలి
సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యాపార ప్రకటనలకు దూరంగా ఉంటారని సజ్జనార్ పేర్కొన్నారు. నేటి తరం సెలబ్రిటీలు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. సమాజం ఏమైనా ఫరవాలేదు డబ్బే ముఖ్యం అనే ఆలోచనలనుండి బయటపడాలని సూచించారు. ప్రజలకు నష్టం కలిగించే సంస్థలకు సంబందించిన వ్యాపార ప్రకటనలకు దూరంగా ఉండాలని సజ్జనార్ సూచించారు.
……………………………………….