
ఆకేరున్యూస్ : పహల్గాం ఉగ్రదాడి ఘటనపై భారత భద్రతా బలగాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు కేంద్రం అప్పగించింది. ఉగ్రవాదుల దాడి మరుసటి రోజు నుంచే ఎన్ఐఏ బృందాలు పహల్గాంలో విచారణను ప్రారంభించాయి. ఘటన జరిగినప్పుడు ఉగ్రవాదులను చూసిన పర్యాటకులను పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఉగ్రవాద నిరోధక సంస్థకు చెందిన పోలీసు సూపరింటెండెంట్ పర్యవేక్షణలో విచారిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అలాగే పర్యటన సమయంలో ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
……………………………