
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ (Cengral Cabinet) లో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని నిర్ణయించింది. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణలోని గాంధీభవన్లో సంబరాలు జరిగాయి. రాహుల్ గాంధీ, సోనియా చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రాహుల్ గాంధీ(Rahulgandhi) ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన అమలు చేస్తోందని మొదటి ఆ పార్టీ చెబుతోంది. దేశంలో తొలిసారి సమగ్ర కుల సర్వే కాంగ్రెస్ ప్రభుత్వమే చేపట్టిందని పేర్కొంటున్నారు. సోషల్ ఎకనామిక్ సర్వే ద్వారా ఆర్థికంగా వెనకబడిన వారికి చేయూత ఇస్తుందని, కేంద్రం అన్ని రాష్ట్రాల్లోనూ కుల గణన సర్వే చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈక్రమంలో నిన్న కేంద్ర కేబినెట్ కులగణనపై నిర్ణయం తీసుకుంది. అది కాంగ్రెస్(Congress) కృషే అని ఆ పార్టీ సంబరాలు చేస్తోంది.
…………………………………………………