ఆకేరున్యూస్ డెస్క్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay), కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి(Kishan Reddy) గురువారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఢిల్లీలోని తెలంగాణ భవన్లో అంబేడ్కర్ విగ్రహానికి, తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బొగ్గు, గనుల శాఖ కార్యాలయంలో కిషన్ రెడ్డి పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులు, బీజేపీ తెలంగాణ నేతలు పాల్గొన్నారు. కిషన్ రెడ్డికి బీజేపీ తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు అభినందనలు తెలిపారు. దేశంలో బొగ్గు కొరత లేకుండా చూస్తామని కిషన్రెడ్డి అన్నారు. దేశంలో విద్యుత్ ఉత్పత్తి బొగ్గుద్వారానే ఎక్కువ జరుగుతుందని తెలిపారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కూడా బాధ్యతలు చేపట్టారు. నార్త్ బ్లాక్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బండి సంజయ్కు జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి ఆశీస్సులు అందించారు. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు.
——