* అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల ఫైర్
* అభివృద్ధిపై చర్చకు పట్టు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ నెక్లెస్ రోడ్డుపై ఉద్రిక్తత ఏర్పడింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ ను స్వీకరించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఆయన వెంట భారీ బీఆర్ ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. భారీ బందోబస్తు ఏర్పాటుచేసిన పోలీసులు కొప్పులను, బీఆర్ ఎస్ నేతలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.
అసలు ఏం జరిగిందంటే..
పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ మాజీ మంత్రి హరీష్‌రావుకు (Harish Rao) మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Minister Adluri Laxman) సవాల్ విసిరారు. నిజాయితీ ఉంటే ఈరోజు అంబేడ్కర్ విగ్రహం వద్దకు రావాలని అన్నారు. అంబేడ్కర్ సాక్షిగా చర్చిద్దామా అంటూ లక్ష్మణ్ సవాల్ విసిరారు. ఈమేరకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈరోజు అంబేడ్కర్ విగ్రహం వద్దకు వచ్చారు. అడ్లూరికి ఛాలెంజ్ చేశారు. తాను అంబేడ్కర్ విగ్రహం వద్దనే ఉన్నానని, బీఆర్ ఎస్, కాంగ్రెస్ పాలనపై చర్చకు రావాలని అడ్లూరికి ప్రతి సవాల్ విసిరారు. పోలీసులు కొప్పులను, బీఆర్ ఎస్ శ్రేణులను అడ్డుకుని అక్కడి తరలించారు.
హరీశ్ తోకముడిచారు..
మరోసారి మంత్రి అడ్లూరి ఈ వ్యవహారంపై స్పందించారు. సవాలు విసిరితే హరీష్ రావు తోక ముడిచి పారిపోయారంటూ ఎద్దేవా చేశారు. హరీష్ రావు బండారాన్ని వాళ్ళ మరదలు కవితనే బయటపెడుతోందన్నారు. హరీష్ రావు (Harishrao) చర్చకు వస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రి స్పష్టం చేశారు. అయితే హరీష్‌ను చర్చకు రమ్మంటే మాజీ ఎమ్మెల్యేలను పంపుతావా అని ప్రశ్నించారు. కేసీఆర్(Kcr)ను హరీష్ రావు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ మంత్రులు బందిపోటు దొంగలంటూ వ్యాఖ్యలు చేశారు.
…………………………………………………
