* ఐ టీడిఏ ముట్టడిని విజయవంతం చేయాలి
* తెలంగాణ ఆదివాసీ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ
ఆకేరు న్యూస్, ములుగు: నవంబర్ 3న చలో ఏటూరు నాగారం ఐటిడిఎ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఆదివాసీ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు . ఆదివారం ఒడ్డుగూడెం ,కోడిశాల, లింగాల, బొల్లేపల్లి ,బంధాల, బోటి లింగాల తదితర గ్రామాలలో కరపత్రాలు ఆవిష్కరించారు. సందర్భంగా పలువురు నేతలు పాల్గొని మాట్లాడుతూ ఆదివాసీల అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వా అధికారుల నిర్లక్ష్య ధోరణితో ఆదివాసీలు వెనుకబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఉద్యమం మరో కొమరం భీమ్ ఉద్యమం లాగా ముందుకు సాగుదాం,మన హక్కులను సాధించుకుందాం.ఇది నాకు అవసరం లేదులే అని అనుకుంటే మీ పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని వివరించారు .నిరుద్యోగ యువత భవిష్యత్తు తో చెలగాట మాడుతున్న ప్రభుత్వ ధోరణి నుండి విముక్తి కోసం రిజర్వేషన్ల కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైనది ఉద్యమానికి అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచారు.ఈ కార్యక్రమంలో మేడారం సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన సురేందర్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాకా శ్రావణ్,ఆదివాసీ సేన ములుగు జిల్లా కన్వీనర్ ఆలం శ్రీను , మాజీ సర్పంచ్ ఆగబోయిన రామయ్య, పూనెం భాస్కర్ ,పెండకట్ల సాగర్, ఊకె జగ్గారావు ,చేల శంకర్, సారయ్య ,ఊకె రవి ,సుధాకర్, పూనెం నగేష్ ,దనసరి పుల్లయ్య, ఊకె మోహన్ రావు ,కొమరం చంద్రయ్య, నాలి సారయ్య, అగబోయిన కిరణ్ ,నారాయణ తదితరులు పాల్గొన్నారు.
……………………………………….
