
* కారణం ఇదేనా?
ఆకేరు న్యూస్, డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఓజీ (OG) మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో వర్షంలోనే ఆయన తన ప్రసంగాన్ని కొనగించారు. అభిమానులు నిరుత్సాహపడకుండా దగ్గరుండి కార్యక్రమాన్ని నడిపించారు. వర్షం కురుస్తున్నా, గొడుగు కూడా తీయమని చెప్పి మరీ ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. ఒంట్లో బాగోలేనప్పటికీ వైద్యం తీసుకుంటూనే ఆయన అసెంబ్లీకి హాజరయ్యారు. తన శాఖలపై వరుస సమీక్షలు చేశారు. రోజులు గడుస్తున్నా జ్వరం తగ్గకపోవడంతో మెరుగైన చికిత్స కోసం మంగళగిరి (MANGALAGIRI) నుంచి హైదరాబాద్ (HYDERABAD) విచ్చేశారు. ఇక్కడ ప్రముఖ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ చికిత్స పొందారు. హైదరాబాద్లోని నివాసంలో రెస్ట్ తీసుకుంటున్న పవన్ కల్యాణ్ (PAVAN KALYAN)ను పరామర్శించేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు (CHANDRABABU NAIDU) నేరుగా ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే.. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు, చిరంజీవి లేఖ నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తిగా మారింది.
…………………………………………..