
సీఎం చంద్రబాబు నాయుడు
ఆకేరు న్యూస్ అమరావతి : వాతావరణం అనుకూలించక పోవడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనలో స్వల్ప మార్పు జరిగింది.కొవ్వూరులో పెన్షన్ల పంపిణీ లో పాల్గొనడానికి హెలీకాప్టర్లో కొవ్వూరు బయలు దేరిన సీఎం చంద్రబాబు కొవ్వూరులో హెలీ కాప్టర్ ల్యాండింగ్ కు వాతావరణం అనుకూలంగా లేదని అధికారులు సమాచారం ఇవ్వడంతో హెలీకాప్టర్ ను గన్నవరం ఎయిర్పోర్టుకు మరలించారు.గన్నవరం నుంచి చంద్రబాబు ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం వెళ్లి అక్కడనుండి కొవ్వూరు చేరుకోనున్నారు.
……………………………………….