
సీఎం చంద్రబాబు నాయుడు
* ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా పర్యటన
ఆకేరు న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CHANDRA BABU NAIDU) సింగపూర్ (SINGAPUR) లో ఐదు రోజులు పర్యటించనున్నారు. నేటి రాత్రి 11 గంటకు ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సింగపూర్ బయలుదేరనున్నారు. బాబు ఐదురోజుల టూర్ లో పలువురు పారిశ్రామిక వేత్తలను కలువనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల గురించి పారిశ్రామిక వేత్తలతో చర్చించనున్నారు. సింగపూర్ తోపాటు మలేషియా,(MALASIA)ఇండోనేషియా(INDONASIA) థాయ్ లాండ్ (THAILAND)కు చెందిన పారిశ్రామిక వేత్తలతో బాబు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్నార్టీ (AP NRT)ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో బాబు పాల్గొంటారు. వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారిని ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో బాబు ఈ పర్యటన చేస్తున్నట్లు తెలిసింది, కాగా ఈ పర్యటనలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్,( NARA LOKESH) టీజీ భరత్, పీ.నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొననున్నారు.
………………………………………..