
* రవాణా శాఖ ఆదేశాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వాహనదారులకు తెలంగాణ (Telangana) రవాణా శాఖ తక్షణ ఆదేశాలు జారీ చేసింది. పాత వాహనాలకు కూడా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను మార్చుకోవాలని సూచించింది. 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు వాహనాలకు కూడా కొత్త నంబర్ ప్లేట్లు వేసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ (Gejit Notification) ను విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నంబర్ ప్లేట్‌కు కనిష్ఠంగా రూ.320.. గరిష్ఠంగా రూ.800గా ఛార్జీలను ఖరారు చేసింది. నకిలీ నంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం, వాహనాలు రహదారి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేస్తున్నామని రవాణాశాఖ చెబుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. నంబర్ ప్లేట్ (Number Plate) మార్చుకోకపోతే వాహనాల క్రయవిక్రయాలు, ఇన్సూరెన్స్, పొల్యూసన్ సర్టిఫికెట్ లభించవని అధికారులు తెలిపారు. నంబర్ ప్లేట్ మార్పునకు సెప్టెంబర్ 30 వరకు విధించింది.
…………………………………………………….