ఆకేరున్యూస్, హైదరాబాద్: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ఈ నెల 28న కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. దాదాపు రూ.430 కోట్ల వ్యయంతో రైల్వేశాఖ అభివృద్ధి చేయగా.. ఈ స్టేషన్లో ఆరు ఎస్కలేటర్లు, ఏడు లిఫ్ట్‌లు, ఆరు బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మహిళలకు, పురుషులకు వేర్వేరు వెయిటింగ్ హాల్స్, హైక్లాస్ వెయిటింగ్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్లో ఎగ్జిక్యూటివ్ లాంజ్‌ని నిర్మించారు. టెర్మినల్ తొలి అంతస్తులో కెఫ్ టేరియా, రెస్టారెంట్, రెస్ట్ రూమ్ తదితర సౌకర్యాలను కల్పించారు. ప్రయాణికులకు ఉచిత వైఫై సదుపాయం అందుబాటులో ఉంటుంది.
సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లపై
ఒత్తిడి తగ్గిచేందుకే..
సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లపై ఒత్తిడి తగ్గిచేందుకు చర్లపల్లి టెర్మినల్‌ను రైల్వేశాఖ అభివృద్ధి చేసింది. చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించిన అనంతరం ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. దాదాపు 25 ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇక్కడి నుంచే నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. ఇందులో పలు రైళ్లకు సంబంధించి అనుమతి ఇచ్చింది. ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు గూడ్స్ రైళ్లు సైతం ఇక్కడే అన్లోడ్ చేసుకునే వీలుంటుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
……………………………………….