
* తప్పుడు పత్రాలతో ఎన్నికల్లో పోటీపై గతంలో కోర్టు తీర్పు
* తాజాగా డీడీలు అందించిన రమేశ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ (Chennamaneni Ramesh) పౌరసత్వం కేసులో హైకోర్టు తీర్పు మేరకు జరిమానా చెల్లించారు. ఆది శ్రీనివాస్ (Adi Srinivas) కు రూ.25లక్షలను డీడీల రూపంలో అందించారు. జర్మన్ పౌరసత్వం ఉండి తప్పుడు పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేశారని ఆది శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. చెన్నమనేని పౌరసత్వంపై సుదీర్ఘకాలంగా కోర్టులో ఆది శ్రీనివాస్ పోరాడారు. సుదీర్ఘకాలంగా జరిగిన వాదోపవాదాల అనంతరం రమేశ్‌కు జర్మన్ పౌరసత్వం ఉన్నట్లు హైకోర్టు తేల్చింది. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించుకున్నందుకు ఆయనకు జరిమానా విధించింది. పిటిషనర్ ఆది శ్రీనివాస్ కు రూ.25 లక్షలు జరిమానా విధించాలని పేర్కొంది. న్యాయసేవ ప్రాధికార సంస్థకు రూ.5 లక్షలు చెల్లించాలని పేర్కొంది. హైకోర్టు (High Court) తీర్పు మేరకు ఆ డబ్బులను డీడీ రూపంలో తాజాగా చెన్నమనేని రమేశ్ చెల్లించారు.
…………………………………..