
* నలుగురు పిల్లలు ఆస్పత్రి పాలు
* సిరప్ తాగిన కొద్దసేపటికే అస్వస్థతకు గురి
* మెదక్ జిల్లా బుడగజంగం కాలనీలో విషాదం
ఆకేరు న్యూస్ , మెదక్ : సిరప్ వికటించి ఆస్పత్రి పాలైన చిన్నారుల్లో ఒక చిన్నారి మృతి చెందిన
సంఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలోని బుడగ జంగం కాలనీలో చోటుచేసుకుంది.
బుడగజంగం కాలనీలో నివాసముంటున్న సాయమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. వారిలో ఇద్దరు మగపిల్లలు కాగా ముగ్గురు ఆడపిల్లలు. ఈ క్రమంలో ఐదుగురు చిన్నారులు అనారోగ్యానికి గురయ్యారు. జ్వరం, జలుబు సమస్యతో బాధపడుతుండగా వారికి మందులు వేయాలనే ఆలోచనతో తల్లి సాయమ్మ అల్లాదుర్గం పీహెచ్సీ నుంచి నెల క్రితం తీసుకువచ్చిన సిరప్లను పిల్లలకు తాగించింది. సిరప్ తాగిన పిల్లలు ఐదుగురూ వెంటనే అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన తల్లిదండ్రులను పిల్లలను జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించి ప్రియ అనే చిన్నారి మృతి చెందింది. మిగతా పిల్లలకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. అయితే చిన్నారి మృతికి సిరప్ కారణం కాదని వైద్యులు చెప్తున్నారు. ఇంకా సిరప్ ఎక్స్పైర్ కాలేదంటున్నారు. ఇదిలాఉండగా అల్లాదుర్గం పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టం రిపోర్టు వస్తే కాని చిన్నారి మృతికి కారణం తెలియదని పోలీసులు అంటున్నారు. చిన్నారి మృతికి సిరప్ కారణమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
…………………………………………………