
* ఐరా హాస్పిటల్ ప్రారంభంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
ఆకేరున్యూస్, హన్మకొండ: ప్రస్తుత పరిస్థితిలో రకరకాల జబ్బులు వస్తున్న నేపథ్యంలో ఆసుపత్రి కి వచ్చే పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ బాలసముద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐరా పిల్లల హాస్పిటల్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ… పిల్లల కోసం 24 గంటలు వైద్యం అందుబాటులో ఉండడం అభినందనీయమన్నారు. హాస్పిటల్లో అనుభవం గల డాక్టర్స్ ఉన్నారని చెబుతూ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా వైద్యధికారి డా. అప్పయ్య, హాస్పిటల్ డైరెక్టర్స్ డాక్టర్ ఏ. నవీన్, డాక్టర్ నవీన్ రెడ్డి, డాక్టర్ సందీప్, డాక్టర్ డి.సాయిచందర్, డాక్టర్ ఎం.రాజా, డాక్టర్ భరత్ రెడ్డి, డాక్టర్ అరుణ్, డాక్టర్ శ్రావణ్, డాక్టర్ అరవింద్, డాక్టర్ రమేశ్, హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.
……………………………………………