* వెంకన్న హుండీ ఆదాయం రూ.4,66,496లు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.4,66,496లు వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, కార్యనిర్వాహణాధికారి లక్ష్మీ ప్రసన్న తెలిపారు. దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో సోమవారం హుండీలు లెక్కింపు జరిగింది. జనవరి 7వ తేదీ నుండి మార్చి 23 వరకు (75) రోజులకు హుండీలు లెక్కించగా రూ.4,66,496 ఆదాయము వచ్చినట్లు తెలిపారు. ఇందులో
విదేశీ కరెన్సీ ఇంగ్లాండ్ 10 పౌండ్స్ నోట్ (1) వచ్చినవి. కార్యక్రమములో పర్యవేక్షణ అధికారిగా వంశీ (కొడువటూరు దేవాలయం ఈవో, ధర్మకర్త మండలి సభ్యులు, జూనియర్ అసిస్టెంట్ మోహన్,
ముఖ్య అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ, అర్చకులు రంగాచార్యులు, ఆలయ సిబ్బంది, ఇండియన్ బ్యాంక్ మల్కాపూర్ శాఖ అధికారులు, శ్రీ రాజరాజేశ్వర సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.
