* 29 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో లీడింగ్ లో లోక్ జనశక్తి ( రాంవిలాస్ పాశ్వాన్ ) పార్టీ
* ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలో అధికార ఎన్డీయే కూటమి అఖండ విజయం దిశగా పరుగులు తీస్తోన్న విషయం తెల్సిందే.. మొత్తం 243 ఉన్న బిహార్ అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీయే కూటమికి 203 స్థానాలు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపధ్యంలో బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అసాధారణ పోరాటం చేసింది. ఎన్డీయే విజయంలో కీలక పాత్ర పోషించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 29 స్థానాల్లో పోటీ చేసిన ఎల్జేపీ దాదాపు 21 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.
ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అసాధారణ పోరాటం చేసింది. ఎన్డీయే విజయంలో కీలక పాత్ర పోషించింది.బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 29 స్థానాల్లో పోటీ చేసిన ఎల్జేపీ దాదాపు 21 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. గత సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఐదు స్థానాలనూ ఈ పార్టీ గెలుచుకుంది. బిహార్ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో రాం విలాస్ పాశ్వాన్ ప్రముఖ భూమిక పోషించారు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న చిరాగ్ పాశ్వాన్ బిహార్ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ లోక్‌సభకు పోటీచేసిన 5 స్థానాల్లోనూ విజయం సాధించింది, అయితే ఈ ఎన్నికల్లో ఎన్డేయే పొత్తులో భాగంగా చిరాగ్ పార్టీ లోక్ జనశక్తి (రాం విలాస్ పాశ్వాన్) కు 29 సీట్లు కేటాయించగా ఇప్పటి వరకు 21 స్థానాల్లో పార్టీ గెలిచే అవకాశాలు కన్పిస్తున్నాయి. సీట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపధ్యంలో చిరాగ్ పాశ్వాన్ బీహార్ కు ఉప ముఖ్యమంత్రి అవుతారనే వార్తలు విన్పిస్తున్నాయి.
…………………………………………….
